ఏపీలో వచ్చిన వరదలను ఆసరాగా చేసుకుని నిత్యావసరాల ధరలను వ్యాపారులు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం తరపున కూరగాయలు తెప్పిస్తున్నామని, ఫిక్స్డ్ రేట్లతో వాటిని ప్రజలకు విక్రయిస్తామని చెప్పారు. విజయవాడలోని వరదలలో తిరుగుతున్న బోట్లకు బాధితులు ఎవరూ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే పోలీస్ కేసులు పెట్టిస్తానని హెచ్చరించారు.