- ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత
ఇదేనిజం, లక్షెట్టిపేట: గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఐసీడీఎస్ సూపర్ వైజర్ మమత పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని 6, 3, 8 అంగన్వాడీ సెంటర్లను ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పల్లెధవఖానా లో వచ్చిన తల్లులకు వారి పిల్లలకు ప్రతి నెల బరువులు తూయించి, తక్కువ బరువు ఉంటే అదనపు ఆహారం అందించాలన్నారు. ప్రతి గర్భిణీ కనీసం నాలుగు ఆరోగ్య పరీక్షలు చేయించుకొని, ఐరన్, పోలిక్ ఆసిడ్, కాల్సియం మందులు వాడుతూ పోషక విలువలతో కూడిన అహారం తీసుకోవాలని సూచించారు.గర్భిణీ స్త్రీలతో పోషణ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రేజ, ఏఎన్ఎం విజయ, అంగన్వాడీ టీచర్లు శంకరమ్మ, లక్ష్మి, శంకరమ్మ, తల్లులు, పిల్లలు, కిషోర బాలికలు పాల్గొన్నారు.