ప్రముఖ తమిళ హీరో విజయ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. విజయ్ రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగంను (టీవీకే) ఎన్నికల సంఘం అధికారికంగా గుర్తించింది. ఈ మేరకు తమిళగ వెట్రి కళగం పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమిళగ వెట్రి కళగం పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపుపై ఆ పార్టీ అధినేత విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. తమ రాజకీయ పార్టీ చట్టపరమైన నమోదు కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నామని.. అయితే ఇప్పుడు ఈసీ నుంచి గుర్తింపు లభించిందని చెప్పారు.