భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల గడువును మరోసారి పెంచింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువు తేదీని ఈ నెల 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో గవర్నమెంట్, ప్రైవేట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వేల్పేర్ సహా ఇతర జూనియర్ కళాశాలలకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.