అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి భారత్ లో ఉరిశిక్షను విధిస్తారు. అయితే మరణశిక్ష విధించబడిన వ్యక్తిని ఉరి తీసే ముందు తలారి అతని చెవిలో ఏమి చెబుతాడో అనే ప్రశ్న మీ మనస్సులో కలిగే ఉంటుంది. జైలు నియమావళి ప్రకారం “నన్ను క్షమించు” అని చెబుతాడు. నేరస్థుడు హిందువు అయితే ‘రామ్-రామ్’ అని ముస్లీం అయితే ‘సలాం’ అని అంటాడు. “ఇక్కడి పరిస్థితిని మార్చడానికి నేను ఏమీ చేయలేను, నేను ఆదేశాలకు బానిసని” అని చెప్పి మీటను లాగుతాడు.