చెరువులను ఆక్రమించుకొని అక్రమంగా భవనాలు నిర్మిస్తున్న కట్టడాలను హైడ్రా పేరుతో కూల్చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ హైదరాబాద్ లో 25 చెరువులను బడా కంపెనీలకు సుందరీకరణ పేరుతో ఇచ్చేసాడు. కానీ.. వాళ్ళు కొంప ముంచారు.. మొత్తం చెరువులను వారి వ్యాపారం కోసం వాడుకున్నారు. దొంగలకు తాళం చెవులు ఇచ్చినట్టు అయ్యింది. ప్రతి ఫలంగా కేటీఆర్ ఎంత డబ్బు దొబ్బాడో లెక్కేలేదు. ఇలా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. పై పై మెరుగుల కోసం.. పబ్లిసిటీ కోసం కేటీఆర్ చెరువులకు ద్రోహం చేసాడు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంపెనీలకు చెరువులను కట్టబెట్టిన 25 చెరువుల వివరాలు:
శేరిలింగంపల్లి (గోపి చెరువు) -అరబిందో, నానక్ రాంగూడ (భగీరథమ్మ) -మీనాక్షి ఇన్ఫాస్ట్రక్చర్స్, మూసాపేట (మైసమ్మ చెరువు) – వాసవి, ఇబ్రహీంబాగ్ (ఇబ్రహీంబాగ్ చెరువు) – సైబర్ మియాడోస్, నానక్ రాంగూడ (నానక్ రాంగూడ చెరువు) – జయభేరి ప్రాపర్టీస్, చందానగర్ (గంగారాం చెరువు) -శర్వాణి వెంచర్స్ అండ్ ఎవెన్యూస్, మదీనాగూడ (మదీనాగూడచెరువు) -ఇండిస్ స్మార్ట్ హోమ్స్ ప్రై.లిమిటెడ్, కొండాపూర్ (మజీద్ బండ లేక్) -సుమధుర ఇన్సాకాన్ ప్రై.లిమిటెడ్, ఖానామెట్ ( ముల్లకత్వ చెరువు) -మహిరా వెంచర్స్ ప్రై.లిమిటెడ్, పటాన్ చెరువు (సకి చెరువు) – ఇన్కార్ లేక్ సిటీ ప్రాజెక్ట్స్, పటాన్ చెరువు (తిమ్మక చెరువు) -ఏపీఆర్ ప్రాజెక్ట్స్, గోపన్ పల్లి(చిన్న పెద్ద చెరువు) -హానర్ ఎస్టేట్ ప్రై.లిమిటెడ్, హైదర్ నగర్ (ఎల్లమ్మ చెరువు) – భవ్య కన్ స్ట్రక్షన్, నానక్ రాంగూడ (విప్రో లేక్) -వంశీరాం బిల్డర్స్, కూకట్ పల్లి (కూకట్ పల్లి లేక్) -నయాన్ కన్ స్ట్రక్షన్, ఖాజాగూడ(ఎల్లమ్మ చెరువు) – నిహారిక ప్రాజెక్ట్స్, ఖానామెట్ (మొండికుంట) -వాసవి హోమ్స్, యాప్రాల్ (యాప్రాల్ లేక్) -జీకే కన్ స్ట్రక్షన్, సఫిల్ గూడ (సఫిల్ గూడలేక్) -జైన్ కన్ స్ట్రక్షన్, కూకట్ పల్లి (ఐడీఎల్ చెరువు) -గోల్ఫ్ ఆయిల్ లిమిటెడ్, మన్సూరాబాద్ (పెద్దచెరువు) -గ్రీన్ లీవ్స్ ఇన్ఫా, గుట్టలబేగంపేట చెరువు -అయ్యన్న ఫౌండేషన్, మదీనాగూడ (రామసముద్రం) -వెర్టెక్స్ హోమ్స్.