ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశించింది. జాతకాల పేరుతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారని, గతంలో ప్రధాని మోడీ ఫొటోను మార్ఫింగ్ చేశారని మూర్తి అనే వ్యక్తి పిటిషన్ వేశారు. ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తనకు హాని తలపెట్టేందుకు యత్నిస్తున్నారని పిటిషన్లో మూర్తి పేర్కొన్నారు.