ఇదే నిజం, జుక్కల్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం 1930లో నిజాంసాగర్ వద్ద నిజాం ప్రభుత్వం నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు చెక్కుచెదరకుండా ఉంటే, ఏడాదికితం 25 కోట్ల రూపాయలు వెచ్చించి మంజీరా నదిపై నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జి వద్ద రోడ్డు కుంగిపోయి అధికారుల, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అవినీతిని బయటపెడుతుంది. నిజం సాగర్ ప్రాజెక్టు వద్ద మంజీరా నదిపై నిర్మించిన పురాతన బ్రిడ్జి, శిధిలావస్థకు చేరుకోవడంతో, గత ప్రభుత్వంలో మంజీరా నదిపై నూతన బ్రిడ్జి నిర్మాణం కోసం 25 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఈ నిధులతో నిర్మించిన ఈ బ్రిడ్జిని మార్చి 2023లో అప్పటి మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతులు మీదుగా ప్రారంభానికి నోచుకుంది. ప్రారంభానికి నోచుకున్న ఈ లెవెల్ బ్రిడ్జి 6 నెలలకే ఇరువైపులా కుంగుతూ వస్తుంది. రోడ్ల భవనాల శాఖ అధికారులు నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు. వీరి నిర్లక్ష్యం వల్ల నెల రోజుల క్రితం బ్రిడ్జి సమీపంలో రోడ్డు కుంగిపోయింది. దీనిని అధికారులు కుంగిన ప్రాంతం వరకు మట్టిని తొలగించి మళ్లీ మరో వేసి, దానిపై కంకర పోసి వదిలివేశారు. కంకర వేసే తర్వాత దానిపై తారు రోడ్డు వేయాల్సి ఉండగా నెల రోజులుగా దీని గురించి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల మళ్లీ రోడ్డు కుంగి పోయే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఈ రోడ్డు హైదరాబాద్ నుంచి బొంబాయి వరకు కలిపే ఈ ప్రధాన రహదారి పరిస్థితి ఇలా ఉంటే సంబంధిత శాఖ అధికారులు ఆ వైపు దృష్టి పెట్టకపోవడం వలన రాత్రి వేళలో కంకర రోడ్డుపై ప్రయాణించడం ప్రయాణికులకు నరకాన్ని చూపుతుంది. రోడ్ల భవనాల శాఖ అధికారులు దీని గురించి శ్రద్ధ చూపకపోవడం, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మి కాంతావు సైతం ఈ బ్రిడ్జిపై దృష్టి పెట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు మేల్కొని కుంగిపోయిన రోడ్డు వద్ద నాణ్యతంగా తారు రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.