ఇదేనిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మండలాధ్యక్షులు బోంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో మండల నాయకులు, మహిళా నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ తల్లి విగ్రహనికి పాలాభీషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పోరాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని సూచించారు.
ఇచ్చిన హమీలను నేరవేర్ఛకుండా రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తునాడని పేర్కోన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలే కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చేపుతారన్నారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగు విజయ రామారావు, మాజీ మండలాధ్యక్షులు కొమ్ము బాలయ్య, మండలాధ్య ఉపాధ్యాక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, మాజీ పట్టణాధ్యక్షులు సంతోష్ రావు, నాయకులు, మనోషర్, స్వామి, కోడే శ్రీనివాస్, చెవుల మల్లేశ్ యాదవ్, దోరగల్ల బాలయ్య, కంచం నర్సింలు అల్లం లచ్చన్న, నారయాణ, కొండ శ్రీనివాస్, నందురావు, మెంగని బాలమణి, కంచం మంజూల, మెంగని స్వర్ణ లత, దబ్బెడ రేణుక, కూర్ర సావిత్రి, గాండ్ల సుమతి తదితరులు పాల్గొన్నారు.