ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్ మనుమడు నామకరణ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని బాబును ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి,మాజీ సర్పంచ్ చిర్ర గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.