తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి 14 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. అక్టోబర్ 2 గాంధీ జయంతి కలుపుకొని మొత్తం13 రోజులు అన్ని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 15న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి. అలాగే జూనియర్ కాలేజీలకు 6 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులను ప్రకటించింది.