చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా భారత్- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసింది. భారత్ 339 పరుగులకు 6 వికెట్లు నష్టపోయింది. లోకల్ బాయ్ రవిచంద్రన్ అశ్విన్ (102) శతకం సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రవీంద్ర జడేజా (86) అదరగొట్టాడు.