ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గల లిప్సిక సారీ సెంటర్ లో ఐదుగురు మహిళలు సారీస్ బట్టలు కొంటున్నట్లు బేరం చేస్తున్నట్లు నటించి యజమానికి తెలియకుండా కొన్ని చీరలు వారి నడుము భాగాన పెట్టుకొని దొంగతనం చేసి వెళ్లిపోయినరు . అర్ధ గంట సేపు బేరం చేసి కొనకుండా వెళ్లడంపై షాప్ యజమానికి అనుమానం ఏర్పడంతో షాపులో సీసీ కెమెరాలు రికార్డు పరిశీలించగా సిసిపిటోజీలో ఇద్దరు మహిళలు కౌంటర్ వద్ద బేరం చేస్తూ మరో ముగ్గురు మహిళలు డ్రెస్సులు అడ్డం పెట్టుకుంటూ దొంగతనానికి పాల్పడినట్లు సిసి కెమెరాలు రికార్డ్ కావడంతో యజమాని వెంటనే పక్క షాపు వారికి తెలపడంతో జాగ్రత్తపడి ఆటోలో వెళ్లిపోయారు షాపులో పదివేల విలువగల పట్టు చీరలు దొంగతనం పాల్పడినట్లు షాపు యజమాని తెలిపారు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై గణేష్ కు ఫిర్యాదు చేయగా విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.