అమృత పథకంలో అవినీతి జరిగిందని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తాను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా మంత్రికి సవాల్ విసిరారు. ‘నిజంగా చిత్తశుద్ధి ఉంటే రండి మీరు, నేను హైకోర్టు సీజే దగ్గరకి పోదాం.. వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఎంక్వైరీ చేయిద్దాం. తప్పులు ఎం జరగలేదంటే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అని అన్నారు.