Homeహైదరాబాద్latest Newsరైల్వేశాఖ కీలక నిర్ణయం.. పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్..!

రైల్వేశాఖ కీలక నిర్ణయం.. పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్..!

త్వరలో రానున్న పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని టికెట్‌ లేని ప్రయాణికులకు చెక్‌ పెట్టేందుకు భారత రైల్వేశాఖ ప్రత్యేకంగా తనిఖీలు చేసేందుకు సిద్ధమైంది. అక్టోబర్ 1 నుంచి 15 వరకు, అక్టోబర్ 25 నుంచి నవంబర్‌ 10 వరకు టికెట్‌ లేకుండా ప్రయాణించేవారిని కట్టడి చేసేందుకు భారత రైల్వేశాఖ ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించనుంది. ఈ మేరకు 17 జోన్ల జనరల్‌ మేనేజర్‌లకు లేఖ రాసింది. నివేదికలను నవంబర్‌ 18 నాటికి పంపించాలని కోరింది.

Recent

- Advertisment -spot_img