Homeజిల్లా వార్తలుడాక్టర్ vs ఐపీయస్ అధికారి.. గచ్చిబౌలిలోని ఓ పబ్ లో ఘటన.. మహిళ పట్ల అసభ్యంగా...

డాక్టర్ vs ఐపీయస్ అధికారి.. గచ్చిబౌలిలోని ఓ పబ్ లో ఘటన.. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించావంటూ..!

ఇదే నిజం, శేరిలింగంపల్లి: ఐటీ కారిడార్ పరిధిలోని ఓ పబ్ లో ఐపిఎస్ అధికారి, డాక్టర్ మధ్య జరిగిన వివాదం సంచలనంగా మారింది. పబ్ లో జరిగిన చిన్న వివాదం కేసుల వరకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్ పరిధిలోని తబలా రస పబ్ కు ఓ ఐపిఎస్ అధికారి తన కుటుంబంతో వెళ్ళాడు. ఇదే పబ్ కు ఓ మియాపూర్ కు చెందిన డాక్టర్ సైతం వెళ్ళాడు. కాగా ఆ అధికారి కుటుంబ సభ్యురాలు వాష్ రూమ్ కు వెళ్లే క్రమంలో డాక్టర్ చెయ్యి ఆమెకు తగిలినట్లు సమాచారం. ఈ విషయమై డాక్టర్ సారీ చెప్పాగా.. సదరు మహిళ ఈ విషయాన్ని అధికారికి చెప్పింది. దీంతో సదరు అధికారి ఉన్నతాధికారులకు సమాచారం అందించి పబ్ వద్దకు పోలీసులను రప్పించాడు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించావంటూ డాక్టర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచినట్లు సమాచారం. ఉదయం పబ్ నిర్వాహకుల ఫిర్యాదుతో సదరు డాక్టర్ మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో చోటుచేసుకున్న ఈ వివాదంపై వివరాలు వెల్లడించేందుకు ఆసక్తి చూపని పోలీసులు కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

Recent

- Advertisment -spot_img