తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పదిరోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ పోస్టుల భర్తీకి వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖలు అనుమతినిచ్చాయి. వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) భర్తీ ప్రక్రియ ప్రారంభించనుంది. వైద్య విధాన పరిషత్ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులు భారీగా ఖాళీ ఉన్న నేపథ్యంలో మరో 1,600 మెడికల్ ఆఫీసర్ (స్పెషలిస్ట్) పోస్టులను మంజూరు చేయాలని కోరుతూ వైద్య, ఆరోగ్యశాఖ ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపింది.