ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరు ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ దొరల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. సాయుధ పోరాటానికి ఆమె భూ సమస్యే వేదికైంది. తొలి భూపోరాటానికి నాంది పలికింది. దొరలు ఆక్రమించిన భూమిపై ప్రతిఘటించి విజ యం సాధించింది. ఆమె ధీర చరిత్ర ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొంది ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచింది ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్. రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్.సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, నాయకులు కొమ్ము బాలయ్య, చాకలి రమేష్, కంపెల్లి శ్రీనివాస్, తలారి నర్సింలు, మెరుగు అంజా గౌడ్, పెద్దిగారి శ్రీనివాస్, మట్ట వెంకటేశ్వర్ రెడ్డి, సంచు మల్లయ్య, ఓరుగంటి తిరుపతి, మీసా సంజీవ్ దేవి రెడ్డి, తోట ధర్మేందర్ హనుమాన్లు రజక సంఘం నాయకులు సుద్దాల దేవయ్య అక్కరాజు పరుశరాములు. మిడిదొడ్డి యాదగిరి శరయ్య. మాచర్ల బాలయ్య దేవయ్య వివిధ కుల సంఘాల నాయకులు సద్ది మధు మెంగని మనోహర్ .శీలం స్వామి కోడే శ్రీనివాస్. కొప్పు రమేష్. తదితరులు పాల్గొన్నారు.