రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దసరా నాటికీ రైతు భరోసా నిధులు అందిస్తామని తెలిపిన విషయం మనకు తెలిసిందే. అయితే గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకంలో లోపాలను సరిదిద్దడానికి ఆలస్యమైనట్లుగా అధికారులు పేర్కొంటున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో కొండలు, గుట్టలు, సాగుకు యోగ్యం కానీ భూములకు సైతం పెట్టుబడి సహాయం అందజేసి ప్రభుత్వ నిధులు దుబారా చేశారు. దాంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడింది. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు అలా కాకుండా సాగుకు యోగ్యమైన భూములకే రైతు భరోసా అందించాలని ఉద్దేశంతో కసరత్తు నిర్వహిస్తున్నారు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణ సైతం చేశారు. ఇటీవల రైతుల సూచనలు తీసుకున్న ప్రభుత్వం నిబంధనలను ఖరారు చేసినట్లు సమాచారం.