5ఏళ్లలోపు చిన్నారులకు వచ్చే ఇన్‌ఫెక్షన్లకు 90 శాతం కారణం వైరస్‌లే. వీటి కారణంగా మొదటి రెండు, మూడు రోజులు జ్వరం ఎక్కువగా ఉండి, నాలుగైదు రోజుల తర్వాత దానంతటే తగ్గిపోతుంది. కాని అవగాహన లేని కొందరు వైద్యులు చిన్నారులకు యాంటీబయాటిక్స్ ఇస్తుంటారు. ఇలా ఎక్కువగా వాడితే నిరోధకత ఏర్పడి, పిల్లలకు భవిష్యత్తులో నిజంగా అవసరమైన సందర్భాల్లో అవి పనిచేయవు. ఇలా వాడటం కారణంగానే ఒకప్పుడు టైఫాయిడ్‌కు బాగా పని చేసిన సిప్రోఫ్లోక్సాసిన్ ఇప్పుడు అస్సలు పని చేయడం లేదు.