ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం దేవర. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాబడుతోంది. ఎన్టీఆర్ రెండు పాత్రల్లో (తండ్రి దేవర, కొడుకు వర) డిగ్నిఫైడ్‌గా కనిపించారు. ఫైట్స్ బాగున్నాయి. సైఫ్ అలీఖాన్ చాలా కొత్త విలనిజం పండించాడు. జాన్వీ పాత్ర గ్లామరస్ గా ఉంటుంది. క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు స్టోరీని, సన్నివేశాల్లో ట్విస్టులను జొప్పించిన విధానం ఓ రేంజ్లో ఉంది. అనిరుధ్ మ్యాజిక్, రత్నవేలు సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్లస్. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. కథ కంటే.. కథనం బాగుంది.
రేటింగ్ – 3/5