Homeహైదరాబాద్latest NewsIND vs BAN 2nd Test: బంగ్లా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 95..!

IND vs BAN 2nd Test: బంగ్లా ఆలౌట్.. టీమిండియా టార్గెట్ 95..!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌ చివరి రోజు టీమిండియా బౌలర్లు చెలరేగారు. 26/2 ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో భారత్‌ విజయానికి 95 పరుగులు కావాల్సి ఉంది. రెండో ఇన్నింగ్స్ భారత బౌలర్లు అశ్విన్ 3, జడేజా 3, బుమ్రా 3, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీసుకున్నారు. ఇక తొలి ఇన్సింగ్స్‌లో బంగ్లా 233 పరుగులు చేయగా, భారత్ 285 పరుగులు చేసి 52 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.

Recent

- Advertisment -spot_img