Homeహైదరాబాద్latest Newsనేటి నుంచే బతుకమ్మ సంబురాలు.. పండుగ విశిష్టత.. ఎంగిలి బతుకమ్మ పేరు ఎలా వచ్చిందంటే..!

నేటి నుంచే బతుకమ్మ సంబురాలు.. పండుగ విశిష్టత.. ఎంగిలి బతుకమ్మ పేరు ఎలా వచ్చిందంటే..!

తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ ‘బతుకమ్మ’. ప్రకృతిని, పువ్వులను దేవతలుగా కొలుస్తూ తొమ్మిది రోజులపాటు కొనసాగే బతుకమ్మ సంబురాల సందడి మొదలైంది. సబ్బండ వర్గాలు ఏకత్వ స్ఫూర్తిని చాటుతూ అంగరంగ వైభవంగా నిర్వహించే పూలపండగ బుధవారం నుంచే ప్రారంభం కాబోతోంది. దుర్గా నవరాత్రులతోపాటు కొనసాగే ఈ వేడుకలను తమ పుట్టింట్లో జరుపుకోవడానికి మహిళలు గ్రామాలు, పట్టణాలకు చేరుకుంటున్నారు.

బతుకమ్మ పండుగ విశిష్టత
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గొప్ప పండుగ బతుకమ్మ. ఏ పండుగకు కలవకున్నా ఈ పండుగకు మాత్రం ఆడపడుచులంతా కలుసుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తోందంటే ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తాయి. తెలంగాణలో పండుగల్లో పాట నేర్పింది బతుకమ్మనే. పువ్వులతో బతుకమ్మను పేర్చి పువ్వుల నడుమ పుప్పొడిని, పసుపు ముద్దను అలంకరిస్తారు. ఈ పండుగ జరుగుతున్నన్ని రోజులూ పల్లెలు, పట్టణాలు పూలవనాలయిపోతాయి.

ఎంగిలి బతుకమ్మ పేరు ఎలా వచ్చిందంటే..
మొదటి రోజు భాద్రపద బహుళ అమావాస్యనాడు పారంభమవుతుంది. ఈ అమావాస్యను పితృ అమావాస్య అంటారు. ఆ రోజు చేసే బతుకమ్మ పేర్పును ఎంగిలిపువ్వుల బతుకమ్మగా పిలుస్తారు. గౌరమ్మకు సాధారణంగా తెలంగాణ ప్రజలు తినే ఆహారాన్ని, పిండి వంటలను నైవేద్యంగా సమర్పించుకొంటారు. స్త్రీలు భుజించిన తర్వాత చేసుకొంటారు కాబట్టి ఎంగిలి బతుకమ్మ అనే పేరొచ్చింది. బతుకమ్మను పూజించిన తర్వాత పుణ్య స్త్రీలు తమ మాంగల్యాలకు తాకించుకుంటారు. ఆ పూజనే మంగళగౌరి అని, మాంగల్య గౌరి అని భావిస్తారు.

Recent

- Advertisment -spot_img