హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు తాజాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు హైడ్రాకు ఈ ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. కాగా, జులై 19న జీవో ఎం.ఎస్.నం.99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది.