పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లపై గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశారు జారీ చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లను అర్హులకు కేటాయించాలన్నారు. దసరాలోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దసరాలోపు లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి గృహాలు అప్పగించాలన్నారు. ఈ మేరకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.