ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాలలో పితృ అమవాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామాలలోని ప్రజలు తమ పితృదేవతల పేరిట బ్రాహ్మనులకు బియ్యం, కూరగాయలు, పప్పులు, ఇతర వస్తువులు అందజేసి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. బ్రహ్మనులకు బియ్యం, ఇతర సరుకులు అందిస్తే తమ పితృ దేవతలకు అందించినట్లు బావిస్తారు. దీంతో అన్ని గ్రామలలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి గ్రామాలలోని పూజారులకు సమర్పించారు. ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య, పెత్తర అమావాస్య, మహాలయ అమావాస్య అని కూడా పిలుస్తారు. తిథి ప్రకారం పితృలకు నైవేధ్యాలు పెట్టలేనివారు ఈరోజు పెడతారు. ముఖ్యంగా ఈరోజుల్లో మన పెద్దలు భూమిపై సంచరిస్తారని, మనల్ని ఆశీర్వదించడానికి వస్తారనే నమ్మకం ఉంది. ఈ 15 రోజులు పితృల కోసం కేటాయిస్తారి వేధ పండితులు హరిశ్ శర్మ వెల్లడించారు. పితృ అమావాస్య, గాంధీ జయంతి వేడుకలు ఒకే రోజు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడినప్పడికి అమావాస్య వేడుకలు మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి.