Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. రుణమాఫీ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

రైతులకు శుభవార్త.. రుణమాఫీ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!

తెలంగాణలో ప్రభుత్వం రుణమాఫీపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. అధికారులు కూడా ఈ సారి రుణమాఫీపై చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండడంతో, పెద్ద ఎత్తున రుణమాఫీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. సెప్టెంబర్ 30లోగా అర్హులైన రైతులందరి రుణాలను మాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది.అంతేకాకుండా రూ.2 లక్షలకు పైగా రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించింది. సెప్టెంబర్‌ ముగిసిపోయినా లక్షలాది మంది రైతులకు రుణమాఫీ ఇక అందలేదు. రీ సర్వేలో రూ.2 లక్షల వరకు రుణమాఫీకి అర్హులైన రైతుల వివరాలను సేకరించారు. వారి భూముల వివరాలు, సెల్ఫీ ఫొటోలు కూడా తీసుకుని సమగ్ర లెక్కలు సిద్ధం చేశారు. ఆధార్, బ్యాంకు ఖాతాల్లో చిన్నపాటి తప్పుల వల్ల 1.50 లక్షల రుణమాఫీ రైతులకు రుణమాఫీ అందలేదని తేల్చారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకుంటుందన్నారు.ప్రభుత్వం అక్టోబర్ మొదటి వారంలో లేదా దసరా నాటికి రుణమాఫీ ప్రక్రియకు ఆమోదం తెలపవచ్చని తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img