అక్కినేని నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనూ, సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ఈ అంశంపై అక్కినేని అఖిల్ స్పందించారు. “కొండా సురేఖ చేసిన నిరాధారమైన, అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఆమె తన నైతికత సామాజిక సంక్షేమాన్ని మరచిపోయారు. ఆమె ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. ఆమె స్వార్థపూరితంగా గెలవడానికి ప్రయత్నిస్తున్న రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు మరియు సామాజిక అవగాహన ఉన్న మాలాంటి అమాయకులను బలిపశువులను చేసింది. కుటుంబ సభ్యుడిగా, సినీ వర్గాల్లో సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సిగ్గుమాలిన వ్యక్తికి న్యాయపరంగా తగిన బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తాం. ఈ సమాజంలో ఆమె లాంటి వాళ్లకు స్థానం లేదు” అక్కినేని అఖిల్ తెలిపారు.