Homeహైదరాబాద్latest Newsరుణమాఫీ కాలేదని రోడ్డెక్కిన అన్నదాతలు..!

రుణమాఫీ కాలేదని రోడ్డెక్కిన అన్నదాతలు..!

తెలంగాణలో రుణమాఫీ ప్రయోజనం దక్కని రైతులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నారు. తమకు ఎందుకు రుణమాఫీ కావడం లేదన్న ఆగ్రహంతో రైతులు నిరసన బాట పడుతున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ. 2 లక్షల రుణమాఫీ కాలేదంటూ శుక్రవారం రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి ఏలాంటి షరతులు లేకుండా రైతులందరికీ పంట రుణాలు మాఫీ చేయాలని కోరుతున్నారు.

Recent

- Advertisment -spot_img