తెలంగాణలోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. రేషన్ షాప్ కు వెళ్లి ఈ కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వారికి రేషన్ కార్డు ఉందా?ఉంటే ఎంత మంది ఉన్నారు? రేషన్ ఎంత ఇవ్వాలి? వంటి వివరాలు కనిపిస్తాయి. ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేస్తే ఆరోగ్యశ్రీకి అర్హులా? కాదా? అనేది తెలుస్తుంది. ప్రభుత్వ స్కీములు, ఆర్టీసీ బస్సుల్లో పదే పదే ఆధార్ ఇవ్వడానికి బదులు దీనిని వాడుకోవచ్చని చెబుతున్నారు.