ఇటీవల జర్నలిస్టులపై కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దృష్టికి జర్నలిస్టుల సంఘాల నేతలు తీసుకెళ్లారు. దీంపై సానుకూలంగా స్పందించిన కూటమి సర్కార్.. జర్నలిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన, దాడులకు పాల్పడిన పార్టీ నుంచి బహిష్కరిస్తాం. జర్నలిస్టులను ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అది ఏ పార్టీకి చెందిన వారైనా సరేనని, సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. దీనిపై ఏపీ కూటమి సర్కార్ సానుకూలంగా స్పందించడం తో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు.