Homeహైదరాబాద్latest Newsకెనడాలో ఆ ఉద్యోగం కోసం వేలాది మంది భారతీయ విద్యార్థులు క్యూ

కెనడాలో ఆ ఉద్యోగం కోసం వేలాది మంది భారతీయ విద్యార్థులు క్యూ

విదేశీ యూనివర్శిటీలో సీటు వస్తే నాణ్యమైన విద్యను పొందవచ్చని, మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడవచ్చని చాలా మంది విద్యార్థులు భావిస్తున్నారు. అయితే వాస్తవ పరిస్థితి ఒక్కోసారి దారుణంగా ఉంది. మెగ్ అప్ డేట్స్ అనే వినియోగదారు కెనడాలోని భారతీయ విద్యార్థుల దుస్థితి గురించి ఒక ట్వీట్ చేశారు. కెనడాలోని బ్రాంప్టన్ సిటీలో కొత్తగా ప్రారంభించబడిన రెస్టారెంట్ వెయిటర్లు మరియు సర్వర్‌ల కోసం స్థానిక మీడియాలో ప్రచారం చేసింది. ఈ ప్రకటనకు అసాధారణ స్పందన వచ్చిందని, రెస్టారెంట్ ముందు 3 వేల మంది బారులు తీరారని తెలిపారు. వీరిలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారని తెలిపారు. కెనడా యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కోసం వచ్చే భారతీయ విద్యార్థులు పునరాలోచించుకోవాలని ఈ ట్విట్టర్ యూజర్ తెలిపాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ఇది సరైన సమయం కాదని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. అయితే మరికొందరు విద్యార్థులకు మద్దతుగా నిలిచారు.విదేశాల్లో చదువుకోవడం, పార్ట్ టైమ్ ఉద్యోగం చేయడం మామూలేనన్న వ్యాఖ్యలు చేసారు. విద్యార్థులు చదువుకు, తిండికి అయ్యే ఖర్చును ఇలాగే సంపాదిస్తున్నారని వివరించారు.

Recent

- Advertisment -spot_img