Homeహైదరాబాద్latest Newsగుంటూరు జిల్లాలో దారుణం.. పోలీసునంటూ బెదిరించి బి ఫార్మసీ విద్యార్థిని పై అత్యాచారం

గుంటూరు జిల్లాలో దారుణం.. పోలీసునంటూ బెదిరించి బి ఫార్మసీ విద్యార్థిని పై అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బి ఫార్మసీ విద్యార్థినిపై ఓ దుండగుడు పోలీసునంటూ బెదిరించి అత్యాచారం చేశాడు. గుంటూరు నగరంలోని బుచ్చయ్యతోట సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన విద్యార్థి గుంటూరు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ సమీపంలోని కళాశాలలో బీఫార్మసీ తృతీయ సంవత్సరం చదువుతోంది. పాత గుంటూరులోని ఓ బార్బర్ షాపులో పనిచేసే ఓ యువకుడితో ఆమెకు సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. క్రమంగా వారి మధ్య స్నేహం పెరగడంతో పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వారు కొద్దిరోజులుగా గుంటూరు నగరంలోని నెహ్రూనగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని కలిసి ఉంటున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఇద్దరూ ఆర్టీసీ బస్టాండ్‌లో టీ తాగేందుకు వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వచ్చే అప్పుడు కొత్తపేటలోని బోసుబొమ్మ కూడలి వద్ద ఓ వ్యక్తి వారిని అడ్డుకున్నాడు. వెంటనే ద్విచక్రవాహనాన్ని ఆపి ఎందుకు ఆపుతున్నారని ప్రశ్నించారు. ఆ వ్యక్తి తాను పోలీసునని చెప్పాడు. వెంటనే వారు ఇద్దరు కంగారు పడ్డారు. దీన్ని అనువుగా తీసుకున్న దుండగుడు వివరాలు అడిగి తెలుసుకున్న అర్ధరాత్రుళ్లు ఇలా తిరగకూడదని వారితో అన్నాడు. మీరు చెప్పిన వివరాలు నిజమేనా? కదా అని విచారించి నిర్ధారిస్తానని చెప్పాడు. దుండగుడు తాము ఉంటున్న ఇంటిని చూపించాలని కోరగా యువతిని అక్కడే దించుతానని చెప్పాడు. మీరు వారిని అనుసరించండి అని యువకుడికి చెప్పాడు. యువకుడు అంగీకరించి వారిని వెంబడించాడు. కొద్ది దూరం వెళ్లాక… సరిగ్గా అదే సమయంలో పెట్రోల్ అయిపోవడంతో యువకుడి ద్విచక్ర వాహనం ఆగిపోయింది.అయితే అది గమనించిన దుండగుడు… యువతిని బుచ్చయ్యతోట వైపు తీసుకెళ్ళి ఆమె అత్యాచారం చేశాడు.ఆ తర్వాత ఆమెను బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.దీంతో యువతి శనివారం స్థానిక కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img