రిలయన్స్ జియో 1029 ప్లాన్‌ను అప్‌డేట్ చేసింది. ఈ ప్లాన్ కింద ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల సబ్‌స్క్రిప్షన్లను అందిస్తున్న కంపెనీ.. సవరణలో భాగంగా కొత్తగా అమెజాన్ ప్రైమ్ లైట్‌ను జోడించింది. దీంతో అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్ సేవలను కూడా వినియోగదారులు ఆస్వాదించవచ్చు. అమెజాన్ ప్రైమ్ లైట్‌లో కస్టమర్లు రెండు పరికరాల్లో (టీవీ లేదా మొబైల్) స్ట్రీమింగ్‌ను వీక్షించవచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అపరిమిత ఉచిత కాలింగ్, ప్రతి రోజు 100 ఉచిత మెసేజులు పొందొచ్చు. ప్రతి రోజు 2 జీబీల హైస్పీడ్ డేటాను పొందవచ్చు. అంతేకాదు కస్టమర్ ఉన్న ప్రాంతంలో 5జీ కనెక్టివిటీ ఉంటే అపరిమిత 5జీ డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.