దసరా పండుగ వేళ సిరిసిల్ల జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేయడంతో పాటు ₹50 కోట్ల నిధులను మంజూరు చేసింది. యారన్ డిపో టెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. వేములవాడ కేంద్రంగా యారన్ డిపోను ఏర్పాటు చేయడం ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలలోని 30 వేల మరమగ్గాల కార్మికులకు నేరుగా లబ్ది చేకూరనున్నది.