మూసీ విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ప్రక్షాళన చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మూసీని అభివృద్ధి చేయెుద్దని ప్రతిపక్షాలు అన్నారని, ఎందుకు చేయెుద్దో చెప్పాలంటూ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రజలు ఆ మురికి ప్రాంతంలో పుట్టి అక్కడే ఉండిపోయారని, వారి భవిష్యత్ తరాలు కూడా ఇలాగే బతకాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో 10 వేల కుటుంబాలున్నాయని, మూసీలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేసి ఆత్మగౌరవంతో బతకాలని పేర్కొన్నారు. బఫర్ జోన్‌లో ఉన్నవారిని ఎలా ఆదుకోవాలో ఆలోచిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.