హైదరాబాద్ లో ఈ నెల 12న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్ VS బంగ్లాదేశ్ మధ్య టీ20 క్రికెట్ మ్యాచ్ జరగనుంది. అందుకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను రాచకొండ సీపీ సుధీర్ బాబు పరిశీలించారు. అనంతరం డీసీపీలు, ఏసీపీలు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ తో సమావేశం నిర్వహించారు. క్రికెట్ అభిమానులకు అసౌకర్యం కలగవద్దని, టీ20 మ్యాచ్ నిర్వహణకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.