ఇదేనిజం, శేరిలింగంపల్లి: జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఆహార భద్రత అధికారులు తనిఖీలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల మియాపూర్ లోని అతిథి, కోడికూర చిట్టి గారే, అంగారా హోటల్ లో కాలం చెల్లిన నూడిల్స్ ప్యాకెట్లతో పాటు వంటగదిలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. ఇక తాజాగా గచ్చిబౌలి లోని ఓవర్ ది మూన్ పబ్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. కిచెన్ లో కాలం చెల్లిన వస్తువులతో పాటు, అపరిశుభ్రంగా ఉండటంతో అధికారులు మండిపడ్డారు. ఫ్రిడ్జ్ లో ఎటువంటి లేబుల్స్ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. బొద్దింకలతో పాటు పాడైన కూరగాయలు నిల్వ ఉంచడంతో మూన్ పబ్ యజమాన్యంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ప్రశ్నించారు. ఎటువంటి గుర్తింపు లేని ఏడు ప్యాకెట్ ల సాస్ అను అధికారులు గుర్తించారు. మెడికల్ సర్టిఫికెట్ లేకుండా మెయింటైన్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మూన్ పబ్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోనున్నారు అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే నిత్యం ఎక్కడో ఒకచోట టాస్క్ పోర్స్ అధికారులు లోపాలు గుర్తించి నివేదికను అందజేసినా ఆహార తనిఖీ అధికారులు చర్యలు తీసుకోవడంలో నెలల తరబడి తాత్సారం చేయడంలో ఆంతర్యం ఏమిటో అంతుబట్టడం లేదు.