ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సదస్సు ప్రారంభమైంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో అమిత్ షా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ నుంచి ఆ రాష్ట్ర హోంమంత్రి అనిత హాజరయ్యారు. అలాగే తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు పాల్గొన్నారు. 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టించే దిశగా కేంద్రం కార్యాచరణను రూపొందిస్తోంది.