మంత్రి కొండా సురేఖపై హీరో అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతో తీవ్ర పరువు నష్టం కల్గించారంటూ రూ.100 కోట్ల పరువు నష్టం దావాను నాగార్జున దాఖలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో.. సమంత, నాగచైతన్య విడాకులకు కారణం కేటీఆర్ అంటూ.. నాగార్జున, నాగచైతన్య పేర్లు ప్రస్తావిస్తూ అభ్యంతరకర ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే.