ఎవరు అడ్డుపడ్డా మూసీ ప్రక్షాళన ఆగదన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ‘మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు సంపెంగ నూనె కావాలి’ అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. పొద్దున లేస్తే రాష్ట్రం అప్పులపాలైందని, డబ్బులు లేవని అరిచిన రేవంత్.. మూసీ పేరిట రూ.లక్షా యాభైవేల కోట్ల సోకులు, ఆర్భాటం ఎవరికోసమని ప్రశ్నిస్తూ Xలో ట్వీట్ చేశారు.