ఇంద్రకీలాద్రిపై వెలుగొందుతున్న కనకదుర్గమ్మ సన్నిధిలో దసరాన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దుర్గమ్మ దగ్గర పలువురు పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా దుర్గమ్మ ఆలయంలో విధులు నిర్వహించేందుకు నలుగురు సీఐలు కూడా వచ్చారు. అయితే నలుగురు సీఐలు విధులు నిర్వహించకుండా పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరు పేకాట ఆడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. పోలీసులు పేకాట ఆడుతున్న దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది.వీరిలో విజయవాడ టూ టౌన్ సిఐ కొండలరావు, పెనుగొండ సీఐ రాయుడు, మరో ఇద్దరు సీఐ లు ఉన్నారు. ఈ వీడియో చూసిన వారంతా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుర్గమ్మ సన్నిధిలో డ్యూటీ వచ్చి ఏం పని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు పోలీసు అధికారులు ఈ విషయంపై అంతర్గత విచారణ చేపట్టినట్లు సమాచారం.