తాజాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సిఎంమా ‘దేవర’ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవల ‘దేవర’ సినిమా సక్సెస్ మీట్‌లో హరి అనే వ్యక్తిని ఎన్టీఆర్ పలు ఇంటర్వ్యూలలో ప్రశంసించారు. చాలా సందర్భాల్లో జూనియర్ ఎన్టీఆర్ హరి పేరును ప్రస్తావించడం సంచలనంగా మారింది. ఈ హరి ఎవరా అని తారక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు. ఆ హరి ఎవరంటే ఎన్టీఆర్ అన్నయ్య అయిన కళ్యాణ్ రామ్ భార్యకి తమ్ముడు అవుతాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ని కళ్యాణ్ రామ్ కొన్నాళ్ల క్రితం స్థాపించాడు. సో.. ఈ బ్యానర్ కార్యకలాపాలన్నీ హరి చూస్తున్నాడు. ‘దేవర’ సినిమా సినిమా అప్‌డేట్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్ నిర్వహణలో నిర్మాత హరి సరైన ఏర్పాట్లు చేయడం లేదని ఎన్టీఆర్ ను దెబ్బతీసే చర్యలు జరుగుతున్నాయని కొందరు అభిమానులు తారక్ కు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఆరోపణలపై ఎన్టీఆర్ స్పందించారు.హరి వచ్చిన తర్వాతే తారక్‌కి, అభిమానులకు మధ్య దూరం పెరిగిందనే వార్తలపై ఎన్టీఆర్ స్పందించారు.