యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాప్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేవర. ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దుసుకెళ్తోంది. మొదటి రోజే రికార్డు కలెక్షన్స్ తో దుమ్మురేపింది. చిత్రం విడుదలై పది రోజులు పైనే అయినా స్టడీగా వసూళ్లు నమోదు చేస్తోంది. దేవర రెండు తెలుగు రాష్టాల హక్కులను నాగ వంశి కొనుగోలు చేసారు. సితార్ ఎంటర్టైన్మెంట్స్ రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లతో అన్ని ఏరియాల కలిపి రూ. 112.50 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగింది దేవర. సూపర్ హిట్ టాక్ తో కేవలం మొదటి 10 డేస్ లోనే ఆ టార్గెట్ దాటి రూ. 135.83 కోట్లు రాబట్టింది. దేవరను కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరికి లాభాలే అనిచెప్పాలి. అటు హిందీ లోను దేవర విజయయాత్ర కొనసాగుతుంది. ఇప్పటికే అక్కడ లాభాల బాటలో ఉంది. ఓవర్సీస్ సంగతి చెప్పక్కర్లేదు. లాంగ్ రన్ లో నార్త్ అమెరికాలో 7 మిలియన్ కలెక్ట్ చేసిన ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఓవరాల్ గా మొదటి పది రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 25 కోట్లకు పైగా లాభాలు వచ్చాయి.