Homeహైదరాబాద్latest Newsకొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.. కోర్టులో నాగార్జున వాంగ్మూలం..!

కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి.. కోర్టులో నాగార్జున వాంగ్మూలం..!

హీరో అక్కినేని నాగార్జున కుటుంబం నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. అయితే ఈ కేసుకు సంబంధించి నాగార్జున స్టేట్మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేయనుంది. నాగార్జునతో పాటు అమల, నాగచైతన్య సైతం కోర్టుకు హాజరయ్యారు. తన కుమారుడు నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు తెలిపారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టును కోరారు.

Recent

- Advertisment -spot_img