తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖలో ఉద్యోగాల భర్తీకి త్వరలో భారీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే పదేళ్లుగా నిలిచిన పదోన్నతులను పూర్తి చేశామని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 నంబర్ కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు.