పిఠాపురం అత్యాచారం కేసులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత వంగా గీత మండిపడ్డారు. కాకినాడ జీజీహెచ్ సఖి సెంటర్లోని పిఠాపురం అత్యాచార మైనర్ బాలికను మాజీ ఎంపీ వంగా గీత పరామర్శించారు. అనంతరం వంగా గీత మాట్లాడుతూ…కాకినాడ జిల్లా నేరాలపై సమీక్ష జరపాలని డిప్యూటీ సీఎం పవన్ డిమాండ్ చేశారు. అర్ధరాత్రి 12 గంటలకు మహిళలు రోడ్లపైకి వస్తే స్వేచ్ఛ వస్తుందని గాంధీ అన్నారు. పిఠాపురంలో మధ్యాహ్నం 12 గంటలకు రోడ్డు పై ఉన్న మహిళపై అత్యాచారం చేశారని ఆగ్రహించారు మాజీ ఎంపీ వంగా గీత. అత్యాచార నిందితుడు కూటమి పార్టీలకు చెందిన వాడని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇంకా వెలుగులోకి రాని సంఘటనలు అనేకం జరుగుతున్నాయి అని మాజీ ఎంపీ వంగా గీత తెలిపారు.