Homeహైదరాబాద్latest Newsతెలుగుదేశం పార్టీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు

తెలుగుదేశం పార్టీలో చేరిన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు

మాజీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు నేడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. చంద్రబాబు వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న బీదా మస్తాన్ రావు 2019లో వైసీపీలో చేరారు.. 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనను రాజ్యసభకు పంపింది.మోపిదేవి వెంకటరమణ మొదట్లో కాంగ్రెస్‌లో ఉన్నారు. 2012లో వైసీపీలో చేరి.. ఇప్పుడు ఇద్దరూ టీడీపీ పార్టీలో చేరారు.

Recent

- Advertisment -spot_img