Homeహైదరాబాద్latest Newsపూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ : హరీశ్ రావు

పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ : హరీశ్ రావు

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలంగాణ ప్రజలకు, మహిళలకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగ బతుకమ్మ అని తెలిపారు. తెలంగాణ ప్రజలు పూలను పూజిస్తూ, ప్రకృతిని ఆరాధించే గొప్ప పండుగ మన బతుకమ్మ అని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు వచ్చింది. మన బతుకమ్మ పండుగను అమెరికా కూడా అధికారికంగా గుర్తించడం మనందరికీ గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రతి బతుకమ్మ పండుగకు మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ బతుకమ్మ పండుగ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని, ఆయురారోగ్యాలతో సంతోషాన్ని నింపాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img