నేడు సద్దుల బతుకమ్మ వేడుకల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. అమరవీరుల స్మారకస్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నేటి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉందనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.